AP: అమరావతిలోని వెలగపూడి N9 జంక్షన్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎల్ అండ్ టీ స్టాక్ పాయింట్ సంస్థలో భారీగా ప్లాస్టిక్ పైపులు తగలబడ్డాయి. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పైపులు తగలబడుతున్నాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.