TG: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తన పరిధిలోనే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. కేటీఆర్, హరీష్ రావు ఏం మాట్లాడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు.