AP: విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన భూమిని సీఎం బంధువుకు కట్టబెట్టారని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. ‘ఓ వైపు తప్పుడు ప్రచారం.. మరోవైపు విపరీతంగా అప్పులు. అప్పులు బయటకు రాకుండా దాస్తున్నారు. బడ్జెట్లో మోసాలు, కల్పితాలు, అబద్ధాలే కనిపించాయి. సూపర్-6, సూపర్-7 లేవు.. మా స్కీమ్లు కూడా అమలు చేయలేదు. పరిమితులు ఉల్లంఘించి మరీ అప్పులు తెచ్చారు’ అంటూ విమర్శించారు.