WGL: నర్సంపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ ఛైర్మన్ నరేందర్ గుప్తా అన్నారు. నర్సంపేట 12,13వ వార్డులలో వారు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.