AP: శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందింది. జాయేషా(4) ఆడుకుంటూ నీటి సంపులో పడింది. వెంటనే కుటుంబసభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.