గేయ రచయిత అనంత శ్రీరామ్ ‘పెద్ది’ మూవీలోని ‘రై రై రా రా’ పాట వెనుక ఉన్న ఆసక్తికర విశేషాలను పంచుకున్నాడు. ఈ పవర్ఫుల్ పాట రాయడానికి ఆయనకు రెండు నెలల సమయం పట్టిందట. బస్ కండక్టర్లు వాడే ‘రై రై’ పదానికి ‘రా రా’ కలిపి, శ్రీశ్రీ కవితా శైలి స్ఫూర్తితో ఈ పాటను అద్భుతంగా తీర్చిదిద్దినట్లు అనంత శ్రీరామ్ చెప్పాడు. ఇక ఈ పాట యూట్యూబ్‌లో 40Mలకుపైగా వ్యూస్‌తో అదరగొడుతోంది.