T20 WC ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లడాన్ని TMC MP కీర్తి ఆజాద్ తప్పుబట్టడంపై హర్భజన్ సింగ్ తీవ్రంగా స్పందించాడు. స్వయంగా భారత మాజీ క్రికెటర్ అయిన కీర్తి, ఈ విషయంపై రాజకీయాలు చేయడం తగదని, ఆయన నుంచి ఇలాంటివి ఊహించలేదని భజ్జీ అన్నాడు. బహుశా తాను క్రీడాకారుడినే అని ఆయన మర్చిపోయి ఉంటారని, ఇంకా రాజకీయాలే ఎక్కువై ఉండొచ్చని విమర్శించాడు.