రణ్వీర్ సింగ్, ఆదిత్య ధర్ క్రేజీ కాంబోలో రాబోతున్న ‘ధురంధర్ 2’ మూవీ మార్చి 19న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ ప్రీమియర్స్ బుకింగ్స్‌తోనే రికార్డులు తిరగరాస్తోంది. ఇండియాలో ఇప్పటికే రూ.20 కోట్ల మార్కును చేరుకోగా, నార్త్ అమెరికాలో 8 లక్షల డాలర్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ లెక్కలు చూస్తుంటే ధురంధర్ హవా మామూలుగా లేదనిపిస్తోంది.