NTR: విజయవాడలో ఈ వారం పొడి, వేడి వాతావరణం కొనసాగనుందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 5 రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు 34°C – 36°C వరకు, కొన్నిచోట్ల 35°C–37°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు 21°C – 24°C మధ్య ఉండనున్నాయి. మధ్యాహ్న వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.