స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఆరుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. రాజధాని బెర్న్ నగరానికి పశ్చిమాన 25 కిలోమీటర్ల దూరంలోని కెర్జర్స్ పట్టణంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.