KRNL: బెంగళూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన ‘అస్మిత్ ఖేలో ఇండియా సౌత్ జోన్ కిక్ బాక్సింగ్’ పోటీల్లో కర్నూలు క్రీడాకారిణులు ప్రతిభ చూపించారు. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొన్న పూజిత వెండి పతకం, సహస్ర కాంస్య పతకం సాధించి నగదు బహుమతులు మంగళవారం అందుకున్నారు. ప్రతిభ చాటిన వీరిని ఏపీ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనంద్ బాబు అభినందనలు తెలిపారు.