VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 969 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. విశాఖలోని భీమిలి,పెందుర్తి మండలాల్లో 79 పంచాయతీలు ఉండగా.. అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో 646 పంచాయతీలు కలవు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 11 మండలాల్లో 244 పంచాయతీలు ఉన్నాయి. ముందుగా పరిషత్ ఎన్నికలు నిర్వహించి, తర్వాత పంచాయతీ ఎన్నికలు చేపట్టే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి.