MBNR: జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళా భవనంలో ఈ నెల 12న వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా స్థాయి సమావేశం జరగనుంది. దివ్యాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఈ సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు జంగన్న ముఖ్యఅతిథిగా హాజరవుతారని, దివ్యాంగులందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.