ATP: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డిని రాయదుర్గం యువనాయకుడు మెట్టు విశ్వనాథ్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇటీవల చేపట్టిన పార్టీ కార్యక్రమాలు, నూతన కమిటీల నియామకంపై అధినేతకు వివరించారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో చేస్తున్న కృషిని జగన్ అడిగి తెలుసుకున్నారు.