HYD: అమీర్పేట్ మెట్రో స్టేషన్ నుంచి పంజాగుట్ట X రోడ్స్ వరకు వాహనాల రద్దీ అధికంగా ఉంది. ట్రాఫిక్ కదలిక చాలా నెమ్మదిగా సాగుతోందని నగర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించేవారు సమయానికి చేరలేకపోవచ్చని, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు. డ్రైవర్లు జాగ్రత్తగా వాహనాలు నడపాలని, ట్రాఫిక్ సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.