HYD: GHMC పరిధిలో జనగణన ప్రక్రియపై నోడల్ ఆఫీసర్ భారతి హోలీకేరి (IAS) ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. GHMC కమిషనర్, జోనల్ కమిషనర్లు పాల్గొన్న ఈ భేటీలో.. ప్రతి ఇంటికి వెళ్లి కచ్చితమైన జనాభా వివరాలు సేకరించాలని ఆదేశించారు. అధికారులకు రెండు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం క్షేత్రస్థాయిలో జనగణన ప్రారంభం కానుంది.