KRNL: ఎమ్మిగనూరులో 2026-27 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ పరీక్ష రాసే విద్యార్థులకు మొదటసారి పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆదోని పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ చిన్నపురెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మిగనూరు పట్టణంతో పాటు మంత్రాలయం, పత్తికొండ పట్టణాల్లో పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.