TG: ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలు కనిపిస్తున్నా అనర్హత పిటిషన్లు కొట్టివేశారని BRS MLA పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పార్టీ మారకపోతే వారంతా BRS భవన్కు రావాలని, పార్టీ మారినవాళ్లను విడిచిపెట్టేదే లేదన్నారు. మళ్లీ SCకి వెళ్తానన్నారు. అనర్హత పిటిషన్ వేయడానికి తనకు హక్కు ఉందని, ఇది దుర్మార్గమైన నిర్ణయం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.