VKB: సర్వేయర్లుగా శిక్షణ ఇచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చి వారికి జీతాలు ఇవ్వాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. వికారాబాద్ మండలంలో శిక్షణ పొందిన లైసెన్స్ సర్వేయర్లు మాజీ ఎమ్మెల్యేను ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి శిక్షణ ఇచ్చిన ఉద్యోగులకు పోస్టింగులు ఇవ్వకపోవడం దారుణమని అసహనం వ్యక్తం చేశారు.