TG: హైదరాబాద్ కూకట్‌పల్లిలో స్పా ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆన్లైన్లో కస్టమర్లను బుకింగ్ చేసుకుని స్పా సెంటర్లో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దాడిలో 10 మంది యువతులు పట్టుబడ్డారు. నిర్వాహకురాలు దివ్యతోపాటు సంగీత, ప్రకాష్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.