టీ20 ప్రపంచకప్లో ఆకట్టుకున్న శివమ్ దూబే ఫైనల్ మ్యాచ్ అనంతరం రైలులో ఇంటికి వెళ్లాడు. తన పిల్లలను చూసేందుకు అహ్మదాబాద్ నుంచి ముంబైకి తన భార్యతో కలిసి ప్రయాణించాడు. ఎవరూ గుర్తుపట్టకుండా టీషర్ట్, క్యాప్, మాస్క్ ధరించినట్లు చెప్పాడు. విమానాల్లో బుకింగ్స్ లేకపోవడంతో రైలులో ప్రయాణించినట్లు వెల్లడించాడు. రైలు బయలుదేరే 5 నిమిషాల ముందు వరకు కారులోనే కూర్చున్నట్లు తెలిపాడు.