PPM: గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామానికి బుధవారం ఏనుగులు గుంపు చేరుకుంది. దాంతో గ్రామస్తులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. పంటలు పొలాలు ధ్వంసం చేయడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరాడ మండలంలో సంచరించిన ఏనుగులు గరుగుబిల్లి మండలానికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలోకి చొరబడుకుండా మంటలు ఏర్పాటు చేశారు.