ASR: కొయ్యూరు ఎంపీడీవో కార్యాలయంలో ఈ నెల 13న రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రక్తదాన శిబిరంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని, రక్తదానం చేయాలని కోరారు. అలాగే మండల ప్రజలు, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.