VSP: విశాఖలో బార్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. GVMC పరిధిలో మిగిలిన 25 బార్ల కేటాయింపునకు ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. ఏడాదికి రూ.95 లక్షల లైసెన్స్ ఫీజుతో పాటు దరఖాస్తుతో రూ.5 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ తప్పనిసరి కావడం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.