TG: ఖమ్మం వెలుగుమట్ల నిరాశ్రయులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. ఇవాళ 311 మందికి ఇంటి పట్టాలు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను పంపిణీ చేయనున్నారు. మరో 101 మందికి ఇంటి నిర్మాణ పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెలుగుమట్ల భూముల్లో 412 మందిని బాధితులుగా గుర్తించారు. మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి బాధితులకు పట్టాలు పంపిణీ చేయనున్నారు.