E.G: గల్ఫ్ యుద్ధ ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో కోళ్ల రైతులు గందరగోళంలో పడ్డారు. గుడ్ల ధర తగ్గు తుండడంతో పాటు ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో వాటిని దేశీయంగానే విక్రయించాల్సి వస్తోంది. సరఫరా పెరిగి డిమాండ్ తగ్గడంతో గుడ్డు ధర తగ్గి రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లులో మన రాష్ట్రంలో 20 శాతం మాత్రమే వినియోగిస్తారు. మిగిలినవన్నీ ఎగుమతి అవుతాయి.