GDWL: అలంపూర్ వాసవి నిత్యాన్నదాన సత్రంలో ఏర్పాటు చేసిన జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి వారి 3D పెయింటింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కర్నూలుకు చెందిన కట్టా కృష్ణయ్య తన భార్య వాసంతి జ్ఞాపకార్థం రూ. 4 లక్షల వ్యయంతో రిసెప్షన్ హాలులో దీనిని వేయించారు. ఈ సందర్భంగా దాత కృష్ణయ్యను సత్రం నిర్వాహకులు శాలువాతో సన్మానించారు.