MDK: ప్రజలకు సేవలు అందించడం కోసమే ఉద్యోగులు పనిచేయాలని, వారిపట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు తప్పవని రామాయంపేట ఎంపీడీవో షాజీలొద్దీన్ హెచ్చరించారు. ప్రగతి ధర్మారం గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించారు. డ్రైనేజ్, సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.