RR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 316వ వర్ధంతి సందర్భంగా చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలోని వెనుకబడిన వర్గాల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గంలో నేటి తరం ముందుకు సాగాలన్నారు.