ASF: ఆసిఫాబాద్ కలెక్టరేట్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరిత, MLA హరీష్ బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన డాన్సులు, కరాటే ప్రదర్శన ఆకట్టుకున్నాయి. మహిళల సాధన, సాధించిన విజయాలను గుర్తించి ప్రోత్సాహక ప్రసంగాలు అందించారు.