VZM: జిల్లా పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యలను పరిష్కరించేందుకు తపాలా అదాలత్, పెన్షన్ అదాలత్ నిర్వహించనున్నట్లు పర్యవేక్షకులు శ్రీనివాస్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అదాలత్ ఈ నెల 25 ఉదయం 11 గంటలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సమస్యలు, ఫిర్యాదులు ఈ నెల 23 లోపు పంపాలన్నారు.