అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మైనార్టీల సంక్షేమంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని నగర మేయర్ మహమ్మద్ వసీం విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన రిజర్వేషన్లు, జగన్ హయాంలో అందించిన షాదీ తోఫా, గౌరవ వేతనాలే ముస్లింలకు నిజమైన గుర్తింపునిచ్చాయని పేర్కొన్నారు.