SRD: సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ (1), కంప్యూటర్ సైన్స్ (1) విభాగాల్లో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ భారతి తెలిపారు. ఆసక్తిగల వారు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులకు 13న సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థులు పీజీలో 55% (SC/STలకు 50%) మార్కులు కలిగి ఉండాలని సూచించారు.