TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఈనెల 14 వరకు 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయటకు రాకుండా జాగ్రత్తపడాలని సూచించారు. డీహైడ్రేషన్, వడదెబ్బ నుంచి రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.