ELR: తప్పిపోయిన బాలుడిని ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేవలం 30 నిమిషాల్లో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. సత్రంపాడుకు చెందిన ముళ్లపూడి పెద్దిరాజు కుమారుడు మంగళవారం మధ్యాహ్నం పాఠశాల నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. సాయంత్రం 6:30 గంటలకు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆశ్రమం వద్ద బాలుడిని గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.