AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో నేటి నుంచి రెండు రోజులు పాటు తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మునిసిపల్ కమిషనర్ ప్రసాదరాజు తెలిపారు. పులపర్తి వద్ద తాగునీటి పైప్ లైన్ దెబ్బతినడంతో మరమ్మత్తు పనులు చేపట్టామన్నారు. ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ల ద్వారా తాగినీటిని సరఫరా చేస్తామన్నారు. ఆ ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.