NDL: మిడుతూరు మండలంలో సుమారు 2,500 ఎకరాల్లో సాగు చేసిన పొగాకు పంట కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. కంపెనీలు కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చినా, ఇప్పటివరకు ప్రారంభించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది ఫిబ్రవరిలోనే కొనుగోళ్లు మొదలయ్యాయని గుర్తుచేశారు. క్వింటాకు రూ.18 వేలు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.