JGL: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలోని ప్రభుత్వ ఐటీఐ-ఏటీసీలో రెండు వారాల స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ కోర్సులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు లక్ష్యంగా సీఎన్సీ, ఆటోమేషన్, ఎలక్ట్రికల్ వెహికల్స్, సీఐడీ తదితర కోర్సులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.