• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి: కృష్ణ యాదవ్

MBNR: బీసీలకు న్యాయమైన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలంటే 42 శాతం రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీసీ జేఏసీ కన్వీనర్ బూర్గుపల్లి కృష్ణ యాదవ్ డిమాండ్ చేశారు. జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు అంబేద్కర్ కళా భవన్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లు అమలు చేశాకే ఎన్నికలు నిర్వహించాలన్నారు.

January 10, 2026 / 04:20 PM IST

రథసప్తమి పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి

జగిత్యాల: పట్టణంలోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో నిర్వహించనున్న రథసప్తమి ఉత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల పట్టణంలోని మెడికల్ కళాశాలలో ఇవాళ ఆవిష్కరించారు. ఉత్సవాలకు భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

January 10, 2026 / 04:20 PM IST

‘జలగలంచ ఫోర్ట్ వ్యూ పాయింట్’ను ప్రారంభించిన: మంత్రి

MLG: తాడ్వాయి (M) జలగలంచ వాగు ప్రాంతంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ‘పచ్చని అడవి అందాల జలగలంచ ఫోర్ట్ వ్యూ పాయింట్’ను మంత్రి సీతక్క ఇవాళ ప్రారంభించారు. పట్టణాల్లో కలుషిత వాతావరణం నుంచి దూరంగా కుటుంబ సమేతంగా సరదాగా గడపడానికి MLG జిల్లా ప్రకృతి అందాలు సిద్ధంగా ఉన్నాయని, బొగట జలపాతం తర్వాత ఈ పాయింట్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తుందని మంత్రి అన్నారు.

January 10, 2026 / 04:19 PM IST

‘జిల్లా ఆసుపత్రిలో శిశు జననాల్లో తేడా’

NGKL: ప్రస్తుత సమాజంలో ఆడ శిశువుల జననం తగ్గుతున్నట్లు డాక్టర్ అమ్రిన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం జనరల్ ఆసుపత్రిలో.. 23 ప్రసవాలు జరిగాయి. అందులో 14 మగ, 9 ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. మగపిల్లాడు ఇంటి వారసుడు అనే సామాజిక మూఢనమ్మకాలను తప్పించుకోవాల్సిన అవసరాన్ని సూచించారు.

January 10, 2026 / 04:19 PM IST

‘రూ.4 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన’

KMM: ఖమ్మం కార్పొరేషన్ 1వ డివిజన్ విద్యానగర్ కాలనీలో రూ. 4 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. గత రెండేళ్లలో విద్యానగర్ అభివృద్ధికి రూ.12 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. డ్రైన్ల పనులను పూర్తి చేసి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని మంత్రి హామీ ఇచ్చారు.

January 10, 2026 / 04:12 PM IST

యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ

యదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూర్ మండలం అమ్మనబొలు గ్రామంలో శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బీస.కృష్ణంరాజు గౌడ్ గ్రామ యూత్ సభ్యులకు వాలీబాల్ కిట్టు, క్రికెట్ కిట్టు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడాల నర్సమ్మ -మల్లయ్య, ఉపసర్పంచ్ కోలా కృష్ణ, AAPC ఛైర్మన్ బీస.భార్గవి తదితరులు పాల్గొన్నారు.

January 10, 2026 / 04:12 PM IST

అడుగడుగున కవ్వంపల్లికి నీరాజనాలు

KNR: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఎస్సీ సెల్ ఛైర్మన్‌గా నియామకమైన అనంతరం తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేసిన సందర్భంగా శనివారం బెజ్జంకి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులు డా. కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కార్యకర్తలు బాణసంచా కాల్చారు. జేసీబీ సహాయంతో గజమాలతో ఆహ్వానించారు.

January 10, 2026 / 04:11 PM IST

‘పని హక్కుపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాడిని ప్రతి వ్యక్తి ఖండించాలి’

SRPT: ప్ర‌ధాని మోదీ ప్రభుత్యం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను రద్దు చేసి జీ రాం జీ 2025 పేరుతో 197 బిల్లును తీసుకురావడాన్ని, తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని డీసీసీ అధ్యక్షులు గుడిపాటి నర్సయ్య అన్నారు.శనివారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు..

January 10, 2026 / 04:08 PM IST

‘ఫంక్షన్ హాల్ నిర్మించాలి’

MNCL: మంచిర్యాలలో ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చొరవ తీసుకోవాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే సతీమణి సురేఖకు ఇవాళ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ పరిధిలో ఉన్న 10 వేల ముదిరాజ్ కుటుంబాలు ఫంక్షన్ హాల్ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

January 10, 2026 / 04:05 PM IST

ప్రజాబాటతో విద్యుత్ సమస్యలు దూరం: ఏఈ

ADB: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రజాబాట కార్యక్రమంతో విద్యుత్ సమస్యల దూరమవుతాయని మండల ఏఈ తిరుపతి రెడ్డి అన్నారు. భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కిందికి వేలాడే తీగలు, విరిగిన వంగిన పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్ వంటి సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

January 10, 2026 / 04:04 PM IST

కరెంటు సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఏఈ

SDPT: ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని చేపట్టిందని సిద్దిపేట పట్టణ విద్యుత్ ఏఈ హుస్సేన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. వారంలో మూడు రోజులు(మంగళ, గురు, శని) ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ ప్రజలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.

January 10, 2026 / 03:56 PM IST

ఎస్సీ స్టడీ సర్కిల్‌లో దరఖాస్తుల ఆహ్వానం

JGL: జగిత్యాల ఎస్సీ స్టడీ సర్కిల్లో ఐదు నెలల ఉచిత ఫౌండేషన్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ డిగ్రీ అభ్యర్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తులు tsstudycircle.co.inలో స్వీకరిస్తారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8న నిర్వహించి, ఎంపికైన 100 మందికి ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందిస్తారు.

January 10, 2026 / 03:51 PM IST

చర్లపల్లి డివిజన్ డీసీ కాలనిలో పర్యటించిన ఎమ్మెల్యే

HYD: ఉప్పల్ నియోజకవర్గంలోని డీసీ కాలనిలో స్థానిక సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పర్యటించారు. భూగర్భ డ్రైనేజీ, కొత్త సీసీ రోడ్ల మంజూరుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని దశలవారీగా పరిష్కరించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డీసీ ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. 

January 10, 2026 / 03:50 PM IST

ముగ్గుల పోటీని ప్రారంభించిన ముఖ్య సంజీవ్ నాయక్

BDK: ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల కూడి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BRS పార్టీ రాష్ట్ర నాయకులు భూక్య సంజీవ్ నాయక్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సంతోషంగా కుటుంబంతో గడపాలని, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

January 10, 2026 / 03:48 PM IST

గాలిపటాలు ఎగరవేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి: SE

BHPL: సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం సంప్రదాయమే అయినప్పటికీ, విద్యుత్ పరికరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని భూపాలపల్లి S.E మాల్సూర్ నాయక్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలో పతంగులు ఎగరవేయడం వల్ల ప్రాణాపాయం పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని హెచ్చరించారు.

January 10, 2026 / 03:46 PM IST