వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సిటీ ఆర్ముడ్ విభాగంలో సిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వెంకటరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కాజీపేట ఫాతిమా జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలైయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.