NZB: ప్రతిఒక్కరూ భక్తిభావాన్ని అలవర్చుకోవాలని పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు హనుమాన్ జంక్షన్ ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పీసీసీ చీఫ్ స్వయంగా హనుమాన్ స్వాములకు వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు.