ADB: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. బుధవారం రాత్రి ఆదిలాబాద్‌లోని ఇందిరమ్మ కాలనీలో స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయి, ఉద్యోగ మోసాలు, అరైవ్-అలైవ్, సైబర్ క్రైమ్, డ్రగ్ అండ్ డ్రైవ్‌పై ప్రజలకు అవగాహన కల్పించినట్లు SP పేర్కొన్నారు.