• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »టెక్

మహీంద్రా వాహనాల ధరల పెంపు

మహీంద్రా అండ్‌ మహీంద్రా SUVలు, వాణిజ్య వాహనాల ధరలను ఈనెల 6 నుంచి 2.5% వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. సంప్రదాయ ఇంధన ఇంజిన్ల (ఐసీఈ)తో నడిచే SUVలు, వాణిజ్య వాహనాల సగటు ధరలు 1.6% పెరుగుతాయని కంపెనీ ప్రకటనలో తెలిపింది. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరల పెంపు వేర్వేరుగా ఉంటుందని పేర్కొంది. XUV7 XO వాహనం ధర తొలి 40 వేల మంది కొనుగోలుదార్లకు మాత్రం పెరగదని వివరించింది.

April 3, 2026 / 08:56 AM IST

7000mAh బ్యాటరీతో రియల్‌మి 16 లాంచ్

రియల్‌మి 16 ఫోన్ 7000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 6400 ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచ్ అయింది. ఇందులో 50MP కెమెరా, IP69 వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.31,999. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌ఛేంజ్ ద్వారా రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు. అద్భుతమైన డిస్‌ప్లే, పర్ఫార్మెన్స్‌తో ఈ ఫోన్ మీ బడ్జెట్‌లోనే లభిస్తోంది.

April 2, 2026 / 10:25 PM IST

2025-26లో 47 లక్షల కార్ల విక్రయాలు

భారత్‌లో 2025-26లో 47 లక్షల కార్ల విక్రయాలు జరిగాయి. మారుతీ సుజుకీ ఇండియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 24,22,713 వాహనాలను విక్రయించినట్లు ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ వెల్లడించారు. అలాగే, మహీంద్రా వాహన విక్రయాలు 20% వృద్ధితో 6,60,276కు చేరాయి. టాటా మోటార్స్ వార్షికంగా 15 శాతం వృద్ధితో 6.4 లక్షల వాహనాలను విక్రయించింది.

April 2, 2026 / 05:48 PM IST

రోడ్‌స్టర్ ధరను భారీగా తగ్గించిన ఓలా ఎలక్ట్రిక్

ప్రముఖ ఈవీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన ప్రీమియం మోటార్ సైకిల్ రోడ్‌స్టర్ ధరను భారీగా తగ్గించింది. 4680 భారత్ సెల్‌పై రూపొందిన ఈ బైక్ ధరను ఏకంగా రూ.60 వేలు తగ్గిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దీని ధర రూ.1,89,999 ఉండగా.. రూ.1,29,999కు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు కొనుగోలు విండోను తెరవనున్నట్లు ఓలా ప్రతినిధి తెలిపారు.

April 2, 2026 / 03:03 PM IST

రాణించిన ఓలా ఎలక్ట్రిక్‌

ఓలా ఎలక్ట్రిక్ మళ్లీ పుంజుకుంది. మార్చి నెల చివరి వారంలో రోజుకు సగటున వెయ్యి యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. మార్చి మొత్తానికి 10,117 రిజిస్ట్రేషన్లు పూర్తైనట్లు తెలుస్తోంది. కస్టమర్లలో పెరిగిన విశ్వాసం కారణంగా భారీ వృద్ధి నమోదైనట్లు కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మొత్తంగా 1 మిలియన్ విక్రయాలు సాధించిన తొలి ఈవీ కంపెనీగా నిలిచినట్లు తెలిపారు.

April 1, 2026 / 02:46 PM IST

TRAI కొత్త యాప్.. SPAM కాల్స్‌కు చెక్

నిత్యం వేధిస్తున్న స్పామ్ కాల్స్, మెసేజ్‌ల బెడదకు చెక్ పెట్టేందుకు TRAI తన ‘DND’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో రిజిస్టర్ చేసుకుని అనవసర ప్రమోషనల్ కాల్స్‌ను సులభంగా బ్లాక్ చేయవచ్చు. నిబంధనలు ఉల్లంఘించిన సుమారు 1.84L నంబర్లను గతేడాది TRAI తొలగించింది. ఇందులో మనకు నచ్చిన కేటగిరీల నుంచి మాత్రమే మెసేజ్‌లు వచ్చేలా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

April 1, 2026 / 10:48 AM IST

బజాజ్ నుంచి రెండు కొత్త 350cc బైక్‌లు

బజాజ్ తన పాపులర్ మోడల్స్ పల్సర్ NS400Z, డామినార్ 400 స్థానంలో 350cc వెర్షన్లను ఈ నెలలో విడుదల చేయనుందట. ట్రయంఫ్‌తో కలిసి 350cc శ్రేణిని తీసుకొస్తున్న తరుణంలో, ‘పల్సర్ NS350Z’, ‘డామినార్ 350’ మార్కెట్లోకి రానున్నాయి. పాత 400cc మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసినట్లు సమాచారం. ఆకర్షణీయమైన ధరలతో రానున్న ఈ బైక్‌లు వాహన ప్రియులను ఆకట్టుకోనున్నాయి.

April 1, 2026 / 09:23 AM IST

యూజర్లకు చుక్కలు చూపిస్తున్న ‘X’

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X'(ట్విట్టర్) యూజర్లకు షాక్ ఇచ్చింది. నిన్న అర్ధరాత్రి నుంచి X సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. పేజీలు లోడ్ కాకపోవడం, లాగిన్ సమస్యలతో వేలాది మంది ఇబ్బంది పడ్డారు. డౌన్‌డిటెక్టర్ నివేదికల ప్రకారం ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే, దీనిపై సంస్థ యాజమాన్యం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

April 1, 2026 / 08:10 AM IST

‘3-2-1’ నియమంతో మీ ఫొటోలు, ఫైల్స్ భద్రం

ఇవాళ ‘వరల్డ్ బ్యాకప్ డే’. డేటా భద్రత ప్రాముఖ్యతను ఈరోజు గుర్తుచేస్తోంది. మన ఫొటోలు, ఫైల్స్ పోకుండా ఉండాలంటే ‘3-2-1’ సూత్రం తప్పనిసరి. అంటే.. ఒరిజినల్‌తో కలిపి మొత్తం 3 కాపీలు ఉండాలి. వీటిని కనీసం 2 వేర్వేరు రకాల స్టోరేజీల్లో(హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్) సేవ్ చేయాలి. అందులో 1 కాపీని కచ్చితంగా క్లౌడ్‌లో భద్రపరచాలి. మీ డిజిటల్ జ్ఞాపకాలు ఎప్పటికీ సురక్షితంగా ఉంటాయి.

March 31, 2026 / 12:32 PM IST

కస్టమర్లకు MG మోటార్స్ షాక్

JSW MG మోటార్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎంపిక చేసిన మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చుల (Input Costs) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కావున మీరు MG కారు కొనాలని భావిస్తే, పాత ధరలకే సొంతం చేసుకునేందుకు ఇదే సరైన సమయం.

March 30, 2026 / 02:40 PM IST

యుద్ధం ఎఫెక్ట్.. EV వైపు మళ్లుతున్న జనం!

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడవచ్చన్న వార్తలతో హైదరాబాద్ పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇబ్బందులు భరించలేక చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల(EV) వైపు మళ్లుతున్నారు. షోరూమ్‌ల వద్ద వినియోగదారులు తమ గోడు వెళ్లగక్కుతున్నారు. దీంతో గత 2 రోజులుగా ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు అమాంతం పెరిగాయని షోరూమ్ యజమానులు చెబుతున్నారు.

March 26, 2026 / 01:14 PM IST

2.8 సెకన్లలో 0-96 kmph వేగం!

అమెరికా కంపెనీ రైన్ మోటర్స్ FP3 అనే కారును విడుదల చేసింది. అమెరికా రిజిస్ట్రేషన్ నిబంధనలను అనుసరించి త్రీవీలర్‌గా వస్తోంది. ఇందులో సుజుకీ హయబుసా 1,340 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఫైబర్‌గ్లాస్ బాడీతో వస్తోంది. ఈ కారు 2.8 సెకన్లలోనే 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. FP3 బేస్ మోడల్ రూ.73.72 లక్షల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది.

March 25, 2026 / 06:24 PM IST

కియా EV2.. సింగిల్ ఛార్జ్‌తో 413కి.మీ. రేంజ్

ఆటోమొబైల్ తయారీ సంస్థ కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV EV2ను యూరప్‌లో విడుదల చేసింది. ఈ SUV 42.2 kWh, 61 kWh బ్యాటరీ సామర్థ్యాలతో అందిస్తోంది. దీని గరిష్ఠ రేంజ్ 413 కిలోమీటర్లు. దీని మోటార్ గరిష్ఠంగా 146 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ కారును యూరప్‌లో 26,600 యూరోల ధరకు అందిస్తున్నారు. భారతీయ రూపాయలలో సుమారుగా రూ.29 లక్షలు (దాదాపు రూ.2.9 మిలియన్లు).

March 25, 2026 / 02:36 PM IST

ఇకపై ఇన్‌స్టా చాటింగ్‌తో జాగ్రత్త!

ప్రముఖ టెక్ కంపెనీ మెటా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టా డైరెక్ట్ మెసేజెస్(DM)లోని ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. చాలా తక్కువ మంది యూజర్లు మాత్రమే ఈ ఫీచర్ వాడుతున్నారని.. దీంతో ఈ ఏడాది మే 8 నుంచి దీన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇదే జరిగితే మెటాకు యూజర్ల చాటింగ్స్‌పై పూర్తి యాక్సెస్ లభిస్తుంది.

March 25, 2026 / 11:32 AM IST

టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJ విడుదల

టయోటా థాయ్‌లాండ్‌లో కొత్త టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని విడుదల చేసింది. ఈ SUVలో 2.7 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ 166 PS పవర్, 245 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తోంది. టయోటా ల్యాండ్ క్రూయిజర్ FJని థాయిలాండ్‌లో THB రూ.12.69 లక్షల ధరకు విడుదల చేసింది. భారతీయ రూపాయలలో రూ.36 లక్షలు. 2026 చివరి నాటికి భారత్‌లో విడుదల కానున్నట్లు సమాచారం.

March 24, 2026 / 01:23 PM IST