జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. భారత్లోని అన్ని రకాల మోడళ్లపై 2% వరకు పెంచుతామని వెల్లడించింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఆడి ఇండియా బ్రాండ్ డెరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ ప్రకటనలో తెలిపారు. Q3 SUV నుంచి SUV RS Q8 వరకు రూ.43.23 లక్షల నుంచి రూ.2.34 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తోంది.