ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ Audi తన వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. భారత్లో లభించే అన్ని మోడళ్లపై 2 శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. పెరిగిన ఈ ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయం, నిర్వహణ ఖర్చుల భారం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది.