• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

టీడీపీ మద్దతుదారు నాగరాజుపై దాడి

సత్యసాయి: బత్తలపల్లి మండలంలో టీడీపీ మద్దతుదారు నాగరాజుపై బుధవారం రాత్రి దాడి జరిగింది. పోట్లమర్రి గ్రామంలో నాగరాజుతో పాటు అతడి తల్లి నాగలక్ష్మి, తమ్ముడు చంద్రశేఖర్, నాగజ్యోతిలపై దుండగులు దాడి చేసి గాయపరిచారు. ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైసీపీ నేతలే తమపై దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

January 15, 2026 / 10:19 AM IST

పక్షిలా ఎగరాలి అంటే.. భీమవరం వెళ్లాల్సిందే..!

W.G: కాళ్ల మండలం పెదమీరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘స్కైరైడ్ అడ్వెంచర్’ను బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా రైడ్ చేసి, గగన విహారం అద్భుతమైన అనుభవమని కొనియాడారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రజలకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సాహస క్రీడను చూసేందుకు స్థానికులు భారీగా తరలివచ్చారు.

January 15, 2026 / 10:15 AM IST

విజేతలకు బహుమతులు అందజేసిన మాజీ మంత్రి

ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా పాల్గొన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముగ్గుల పోటీలకు విశిష్ట అతిథిగా ఆర్కే రోజా విచ్చేశారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు.

January 15, 2026 / 10:09 AM IST

పులివెందుల బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

KDP: పులివెందుల బస్టాండ్‌లో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ బస్సుకు తాళం అలాగే వదిలి వెళ్లడంతో ఓ యువకుడు బస్సు స్టార్ట్ చేసి అడ్డదిడ్డంగా నడపడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఆర్టీసీ సిబ్బంది, పోలీసులు బస్సును అడ్డుకుని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

January 15, 2026 / 10:00 AM IST

‘డిప్యూటీ సీఎం ప్రభుత్వ సహాయం అందించాలి’

KRNL: ఆదోని హౌసింగ్ బోర్డుకు చెందిన లక్ష్మీనరసింహ (18) పుట్టినప్పటి నుంచి తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. చిన్నతనంలో మలవిసర్జన సమస్యకు ఆపరేషన్లు చేయించుకోగా, ప్రస్తుతం కిడ్నీలు దెబ్బతిన్నాయి. నిరుపేద కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులు లేక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం జోక్యం చేసుకుని ప్రభుత్వ సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

January 15, 2026 / 09:58 AM IST

రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

VZM: బొబ్బిలి మండలం పారాది బ్రిడ్జి సమీపంలో రొంపల్లి గ్రామం జంక్షన్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రామభద్ర పురం నుంచి వస్తున్న కారు, బొబ్బిలి నుంచి వస్తున్న ఆటో ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురికి, కారులో ఉన్న ఇద్దరికి గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలు అయిన ముగ్గురిని జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు.

January 15, 2026 / 09:49 AM IST

నిరుద్యోగులకు ఉద్యోగాలు

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగులు పోర్టు అథారిటీలో పోస్టులు భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా సుమారు 10 పోస్టులను భర్తీ చేయనుందని బిఈ, బిటెక్ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలాగే వయసు 28 ఏళ్లు ఉన్నవారు అర్హులని పేర్కొంది. మరిన్ని వివరాలకు వెబ్సైట్ సందర్శించాలి.

January 15, 2026 / 09:32 AM IST

వెనిజులాపై దాడిని నిరసిస్తూ పోస్టర్లు విడుదల

CTR: వెనిజులాపై అమెరికా దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గంగరాజు డిమాండ్ చేశారు. వెనిజులాపై దాడిని నిరసిస్తూ పోస్టర్లను విడుదల చేశారు. అమెరికా దుశ్చర్యను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఖండిస్తున్నా.. మోదీ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దౌర్జన్యంగా వెనిజులాపై దాడి చేశారన్నారు.

January 15, 2026 / 09:30 AM IST

మంత్రి సవితకు అనగాని పుట్టినరోజు శుభాకాంక్షలు

సత్యసాయి: మంత్రి సవితకు జిల్లా ఇంఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెనుకొండ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆమె నిరంతరం ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. సహచర మంత్రికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు కూడా ఆమెకు శుభాకాంక్షలు అందజేశారు.

January 15, 2026 / 09:30 AM IST

ప్రతి ఇంటా సంక్రాంతి వెలుగులు నిండాలి: ఎమ్మెల్యే

ATP: సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఇంట వెలుగులు నిండాలని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన ద్వారా నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, కూటమి నాయకులకు, అభిమానులకు, కార్యకర్తలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

January 15, 2026 / 09:30 AM IST

చెట్టును ఢీకొన్న బైక్.. వ్యక్తి మృతి

VZM: వేపాడ మండలం బొద్దాం నుంచి రామస్వామిపేట వేళ్లే తారు రోడ్డులో బొద్దాం రైల్వే గేట్ సమీపంలో నర్సిపల్లి మెట్టకు చెందిన అన్నదమ్ములు బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో గోపు రామదాసు (26) సంఘటన స్థలంలో చనిపోగా గోపు రామచంద్ర (28) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో అంబులెన్స్‌లో విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

January 15, 2026 / 09:25 AM IST

నేటి నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్‌‌పై రాకపోకలు

NTR: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను సంక్రాంతి నుంచి ఒకవైపు రాకపోకలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు (D) కాజ, చినకాకాని జంక్షన్ నుంచి గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి వరకూ వెళ్లేలా NHAI ఏర్పాట్లు చేసింది. గుంటూరు నుంచి అమరావతి, గొల్లపూడి, VJA, HYD, ELR, ఉత్తరాంధ్ర వైపులకు వెళ్లే వాహనాలకు ఈ నెల 15 నుంచి అనుమతి ఇస్తున్నారు.

January 15, 2026 / 09:24 AM IST

చోరీకి పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

GNTR: తెనాలిలో గత ఆదివారం పలుచోట్ల చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను గురువారం రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన పాత నేరస్తులు మిక్కిలి సందీప్, పఠాన్ మస్తాన్ వలి తెనాలిలోని ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ షెటర్లు పగలగొట్టి చోరీయత్నం చేశారు. అలాగే ఓ వైన్ షాప్‌తో పాటు ఆటోనగర్‌లోని 2 షాపులలో చోరీలకు పాల్పడ్డారు. వీరిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

January 15, 2026 / 09:23 AM IST

ముగిసిన ఎమ్మెల్యే కబడ్డీ కప్ పోటీలు

W.G: పాలకొల్లులో జరుగుతున్న జాతీయ స్థాయి ఎమ్మెల్యే కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. పురుషుల విభాగంలో నాగ్ పూర్ SEC రైల్వే జట్టు, మహిళల విభాగంలో ఢిల్లీ CRPF జట్లు విజేతలుగా నిలిచి కప్ కైవసం చేసుకున్నాయి. విజేతలకు రూ.1.50 లక్షల నగదు, షీల్డులను అందజేశారు. పురుషుల విభాగంలో ఢిల్లీ రాజ్ రైఫిల్, కలకత్తా పోలీస్ జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

January 15, 2026 / 09:14 AM IST

బియ్యం గింజంత బంగారు గాలిపటం

SKLM: సంక్రాంతి పండుగ సందర్భంగా పలాస కు చెందిన సూక్ష్మ కళాకారుడు బ్రహ్మర్షి కొత్తపల్లి రమేష్ ఆచారి బియ్యం గింజంత సైజులో బంగారు గాలిపటం నమూనాతో పాటు ‘సంక్రాంతి’ అనే స్వర్ణ లోగో ను తయారు చేశారు. సుమారు పది మిల్లీ గ్రాముల బంగారంతో, అర సెంటీమీటర్ల ఎత్తు, వెడల్పుతో, పలుచటి బంగారు రేకుపై ఈ కళాఖండాన్ని మూడు గంటల సమయంలో రూపొందించినట్లు తెలిపారు.

January 15, 2026 / 09:13 AM IST