CTR: పెనుమూరు మండలం, పులికల్లు పంచాయితీ పరిదిలోని గొడుగుమానిపల్లి గ్రామంలో రోడ్డు అధ్వానంగా మారింది. రాముల వారి గుడి నుంచి వినాయకుడి గుడి వరకు చెత్తా, చెదారాల వ్యర్థాలతో రోడ్డు చెత్త కుప్పలా మారింది. అటు వైపు వెళ్లాలంటే ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడింది. సంబంధిత అధికారులకు తెలియజేసినా ఫలితం లేదని గ్రామస్థులు వాపోతున్నారు.