యుద్ధం మీద ధ్యాసతో నిద్రలేమితో బాధపడుతున్న ధృతరాష్ట్రుడికి విదురుడు ఇలా చెప్పాడు. ‘1. బలవంతుడితో శత్రుత్వం పెట్టుకున్నవాడు, సర్వస్వం కోల్పోయి ఆపదలో ఉన్నవాడు, ఇతరుల ఆస్తిని దొంగిలించాలనే బుద్ధి ఉన్నవాడు, మనసులో తీవ్ర కోరికలతో రగిలిపోయేవాడు.. ఈ నాలుగు పరిస్థితుల్లో ఉన్నవారికి మనశ్శాంతి ఉండదు, ఎప్పటికీ ప్రశాంతమైన నిద్ర కరువవుతుంది’ అని విదుర నీతి సారాంశం.
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని పోషకాల కారణంగా తక్షణ శక్తి లభిస్తుంది. అలాగే జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, మెదడు పనితీరు మెరుగుపడతాయి. ముఖ్యంగా మహిళలకు రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రాత్రి అంతా నీటిలో నానబెట్టి లేదా పాలతో కలిపి తీసుకుంటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు.
వడదెబ్బ నుంచి రక్షణనిచ్చే అమృతం గంజి. అన్నం ఉడికిన తర్వాత వార్చిన ఈ నీటిలో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇందులోని ఎలక్ట్రోలైట్స్ డీహైడ్రేషన్ బారినుంచి కాపాడతాయి. వేసవిలో పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాక, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అంతేకాదు ఇది అలసటను పోగొట్టి శరీరాన్ని చల్లబరుస్తుంది.
శరీరంలో తగినంత జిడ్డు ఉత్పత్తి కానప్పుడు చర్మం నిర్జీవంగా మారి ఇన్ఫెక్షన్ల ముప్పు పెరుగుతుంది. దీనినే ‘డ్రై స్కిన్’ అంటారు. ఈ సమస్య పోవాలంటే సున్నితమైన క్లెన్సర్, తేమను నిలిపి ఉంచే మాయిశ్చరైజర్లు వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనివల్ల మీ చర్మం తాజాగా, తేమగా ఉంటుంది.
చికెన్‌లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వండిన తర్వాత ఎక్కువసేపు గది ఉష్ణోగ్రతలో ఉంచితే లేదా ఫ్రిజ్‌లో పెట్టి మళ్లీ వేడి చేసినా, బ్యాక్టీరియా పెరుగుతుంది. సాల్మొనెల్లా, ఇ కోలై.. బ్యాక్టీరియా చికెన్‌లో త్వరగా వ్యాపిస్తాయి. శరీరంలోకి చేరినప్పుడు ఫుడ్ పాయిజనింగ్ కలిగిస్తాయి. ఫ్రిజ్‌లో బ్యాక్టీరియా పూర్తిగా చనిపోదు.. ఇవే ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి.
బెల్లం నీటిని రోజూ తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణశక్తిని మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.
నూనెలో కరివేపాకు వేసి మరిగించి, చల్లారాక క్రమం తప్పకుండా పిల్లల తలకు పట్టించాలి. ఐరన్, విటమిన్ బి, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారంతో పాటు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు ఇవ్వాలి. గాఢత గల షాంపూలు, అతిగా తలస్నానం చేయించడం తగ్గించాలి. బాదం నూనె, ఉసిరి నూనె సమపాళ్లలో తీసుకుని రాత్రి పడుకునే ముందు జుట్టు కుదుళ్లకు బాగా మర్దన చేసి ఉదయం తలస్నానం చేయించాలి.
ఎండల తీవ్రత పెరగడంతో శరీరంలో నీటి శాతం తగ్గి నీరసం, జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ సమస్యలు తగ్గాలంటే నిత్యం పరగడుపున గ్లాసు కలబంద రసం తాగాలి. శరీరాన్ని చల్లబరచడమే కాకుండా జీర్ణక్రీయ మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. జట్టు రాలడం తగ్గి, కుదుళ్లు బలంగా మారుతాయి.
మనిషి ఆయుష్షు దేవుడి చేతిలో కాదు, అతని ప్రవర్తనపైనే ఉంటుందని విదురుడు చెప్పాడు. గర్వం(అహంకారం), అతిగా మాట్లాడటం, కోపం, స్వార్థం, మిత్రద్రోహం, లోభత్వం(పిసినారితనం). ఈ ఆరు లక్షణాలు కత్తుల వలె మనిషి ఆయుష్షును దారుణంగా కోసేస్తాయని విదురుడు హెచ్చరించాడు. వీటిని విడిచిపెడితేనే మనిషి పూర్ణాయుష్షుతో, ప్రశాంతంగా జీవిస్తాడని విదుర నీతి సారాంశం.
గోధుమ గింజలోని పీచు, పోషకాలను తొలగించి కేవలం పిండి పదార్థంతో మైదాను తయారు చేస్తారు. ఇందులో ఎటువంటి పోషకాలు ఉండవు. దీనితో చేసిన జంక్ ఫుడ్, స్వీట్లు తినడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మైదా వస్తువులకు దూరంగా ఉండటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, నిద్రలేమి, హార్మోన్ల మార్పుల వల్ల చాలామంది మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారు. ఇది సాధారణ తలనొప్పి కాదు, వాంతులు, తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి. యోగా, సరైన నిద్ర, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే డాక్టరును సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
వంటగదిలోని పదార్థాలతో చేసే కొన్ని చిట్కాలు చర్మానికి హాని చేయవచ్చు. దాల్చినచెక్క పొడి లేదా నూనె రాస్తే మంట, దద్దుర్లు వచ్చే ఛాన్స్ ఉంది. నిమ్మరసాన్ని నేరుగా రాస్తే చర్మం పొడిబారి ఇరిటేషన్ వస్తుంది, కాబట్టి దేనిలోనైనా కలిపి వాడాలి. చక్కెరతో స్క్రబింగ్ చేస్తే దాని పదునైన గుళికల వల్ల చర్మంపై గాయాలవుతాయి. యాపిల్ సిడార్ వెనిగర్ కూడా నేరుగా వాడితే చర్మంపై కాలే ప్రమాదం ఉంది.
రోజూ రెండు కప్పుల తాటి బెల్లం కలిపిన నీళ్లను తాగితే శరీరంలో వేడిని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా కూడా శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చల్లబడుతుంది. అలాగే, కొబ్బరి నూనె లేదా పొద్దు తిరుగుడు నూనెతో శరీరానికి మర్ధన చేసుకుని స్నానం చేయడం వల్ల కూడా ఒంట్లో వేడి తగ్గుతుంది. క్రమం తప్పకుండా ఎర్ర మందారం టీ తాగడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గుతాయి.
బంగాళాదుంపలు అందరూ తినొచ్చు. కానీ మితంగా తినాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. అందుకే, ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే వేడి పెరిగే అవకాశం ఉంది. వేసవిలో బంగాళాదుంపలను ఫ్రై చేసి తినకూడదు. దానికి బదులుగా ఉడికించి రెండు, మూడుసార్లు తింటే ఆరోగ్యానికి మేలు. కొందరికి వేసవిలో దుంపలు తింటే కడుపునొప్పి, గ్యాస్ జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తినకూడదు.