వేసవిలో ఉ.5 నుంచి 7 గంటల మధ్య లేదా సా.6 నుంచి 8 గంటల మధ్య వాకింగ్ చేయాలి. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్, హీట్‌స్ట్రోక్ వంటి సమస్యలు తగ్గుతాయి. ఉదయం గాలి తాజాగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉ.10 నుంచి మ.4 గంటల వరకు నడవడం ప్రమాదకరం. నడక ప్రారంభించే వారు మొదటి రోజు 20 నుంచి 30 నిమిషాలకు పెంచుకోవాలి. క్రమంగా 30 నుంచి 60 నిమిషాలకు పెంచుకోవాలి.
‘నేనెంతో కష్టపడుతున్నాను.. అయినా నా శ్రమను ఎవరూ గుర్తించడం లేదు’ అని బాధితుడి తరహాలో ఆలోచించే దోరణిని ఆపేయండి. మీరెంత కష్టపడుతున్నారనేది ఎవరికీ అవసరం లేదు. మీ గెలుపు దారిని కనుక్కోవాల్సింది మీరే. విజయ శిఖరాన్ని అధిరోహించే వరకూ మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు.
కౌండిన్యాసనం అనేది చేతులు, వెన్నుముకను బలోపేతం చేసే ఒక సవాలుతో కూడిన యోగాసనం. ఇది ఏకాగ్రతను, సూక్ష్మదృష్టిని పెంచడంలో సహాయపడుతుంది. చేతులపై శరీర బరువును మోపే కష్టమైన ఆసనాలలో ఒకటి. శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది నటరాజాసనం, మయూరాసనం వంటి కష్టమైన యోగాసనాల జాబితాలో ఉంటుంది. కౌండిన్యాసనం వేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ముందుగా యోగా నిపుణుల పర్యవేక్షణలో ప్రాక్టీస్ చేయడం మంచిది.
వయసుతో పాటు వచ్చే మలబద్ధకం సమస్యకు ప్రతిసారి మందులు వాడాల్సిన పనిలేదు. రోజూ సరిపడా నీరు తాగడం, ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవడం, పెరుగు వంటి ప్రోబయోటిక్స్ తినడం వల్ల పేగుల ఆరోగ్యం సహజంగా మెరుగుపడుతుంది. ఈ చిన్న మార్పులు జీర్ణక్రియను సాఫీగా మార్చి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది, ప్రకృతి సిద్ధమైన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వండి.
నిమ్మకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మరసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. కిడ్నీలో రాళ్ల నివారణకు ఉపయోగపడుతుంది.
జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. వాటిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. రోజూ తగినంత నీరు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. భోజనానికి మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినాలి. గుడ్లు, పాలు, బాదం, వాల్‌నట్స్, పండ్లు వంటి ఆరోగ్యకరమైనవి తీసుకోవాలి. ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది.
బ్రెౌన్ బ్రెడ్ గోధుమ పిండితో తయారవ్వడం వల్ల ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్. ఇందులో విటమిన్ బి, మెగ్నీషియం వంటి పోషకాలు ఉండి రోజంతా ఉత్సాహంగా ఉంచేలా శక్తిని అందిస్తాయి.
వేసవిలో శరీరానికి తగినన్ని నీళ్లు తీసుకోకపోతే మహిళలు డీహైడ్రేషన్ సమస్యతో పాటు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్(UTI)కి గురయ్యే అవకాశం ఉందని అధ్యయనంలో తేలింది. దీని నుంచి బయటపడాలంటే రోజూ పండ్ల రసాలు, సూపుల వంటి వాటితో పాటు మొత్తం 8 గ్లాసుల ద్రవ పదార్థాలను తీసుకోవాలి. మజ్జిగ తాగితే ఫలితం ఉంటుంది. పుచ్చకాయ, నారింజ, విటమిన్-సి అధికంగా ఉండే పండ్లతో UTI సమస్యను అధిగమించవచ్చు.
డ్రైఫ్రూట్స్‌లో ఒకటైన కిస్‌మిస్‌తో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. దీంతో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెనోపాజ్ దశలో ఎదురయ్యే ఆస్టియోపొరోసిస్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే ఫలితం రెట్టింపు అవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మంపై ముడతలు తగ్గి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
వజ్రాసనం భోజనం తర్వాత చేసే ఉత్తమ యోగాసనం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది. వెన్నుముకను బలోపేతం చేయడం, మానసిక ప్రశాంతతను ఇవ్వడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ 5-10 నిమిషాలు వేయడం వల్ల మెటబాలిజం పెరిగి, బరువు తగ్గడానికి (బొడ్డు కొవ్వు) దోహదపడుతుంది. వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా నడుము నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
గర్భిణీలు ఖర్జూరాలు తినడం వల్ల తల్లి, బిడ్డలకు ఎంతో ఆరోగ్యం. వీటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తే, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కాన్పు సులభం అయ్యే అవకాశాలు పెరుగుతాయని అధ్యయనాలు పేర్కొన్నాయి. అయితే, మధుమేహం ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే తీసుకోవడం ఉత్తమం.
ఆ రోజుల్లో గుమ్మం ముందు ఉన్న అరుగు మీద ఊరి కబుర్లన్నీ పూసేవి. ఉదయం పేపర్ చదివే పెద్దాయన నుంచి, సాయంత్రం మంచి చెడు చెప్పుకునే అమ్మలక్కల దాకా.. ఆ అరుగు ప్రతి ఒక్కరినీ ఆహ్వానించేది. అయితే ఇప్పటి పిల్లలకు అరుగు అంటే కేవలం ఒక పాతకాలపు పదం కావొచ్చు. కానీ, మనకు మాత్రం అది మన బాల్యాన్ని గుర్తు చేసే ఒక మధురమైన అనుభూతి. మరీ మీకూ అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? కామెంట్ చేయండి.
మీరు ఒత్తిడిలో ఉన్నారో? లేదో? కొన్ని లక్షణాలతో తెలుసుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా అనిపించడం, తరచుగా తలనొప్పి, పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటి లక్షణాలతో తెలుసుకోవచ్చు. ఒత్తిడిని పూర్తిగా ఆపలేకపోయినా, అది పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. పని మధ్యలో చిన్న విరామాలు, పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం వంటి మార్పులు గొప్ప ఫలితాలనిస్తాయి.