ఆహార నాణ్యత, పోషకాలను పర్యవేక్షించే కొత్త ఏఐ వ్యవస్థను ఉద్యోగ్ యంత్ర ఏఐ సంస్థ ప్రదర్శించింది. ఏఐ సెన్సర్లు, కెమెరాల ద్వారా వంటలో వాడే దినుసుల పరిమాణాన్ని, నాణ్యతను ఇది గణిస్తుంది. వంట పూర్తయ్యాక అందులోని క్యాలరీలు, విటమిన్ల వివరాలను తెరపై చూపిస్తుంది. ఈ సాంకేతికత ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని సంస్థ తెలిపింది.